పెనుగొండ (ప.గో)

పెనుగొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం, గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 534 320., ఎస్.టి.డి.కోడ్ = 08819.

  • శ్రీ నగరేశ్వర వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవస్థానము ద్వారా పెనుగొండ పట్టణం సుప్రసిద్దము. ఈ నగరం పాలకొల్లు, నిడదవోలు ప్రధాన రహదారిన

పెనుగొండ (ప.గో)
  రెవిన్యూ గ్రామం  

పెనుగొండ (ప.గో)

ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం

అక్షాంశ రేఖాంశాలు:
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పెనుగొండ
ప్రభుత్వము
  సర్పంచి
జనాభా (2001)
  మొత్తం 16,038
 – పురుషులు 8,308
 – స్త్రీలు 8,195
 – గృహాల సంఖ్య 3,948
పిన్ కోడ్ 534320
ఎస్.టి.డి కోడ్ 08819

కలదు. పాలకొల్లుకు 15 కి.మీ. తణుకుకు 16 కి.మీ. దూరంలో ఉంది.

. . . పెనుగొండ (ప.గో) . . .

పూర్తి వ్యాసం కొరకు చూడండి. కన్యకా పరమేశ్వరి

పెనుగొండ ప్రధాన బస్ స్టాండ్

కన్యక లేదా వాసవి కన్యకా పరమేశ్వరీదేవి పేరుతో కుసుమశ్రేష్టి పుత్రికగా జన్మించి విష్ణువర్ధనుడు అనే అహంకార రాజ్యాధిపతితో వివాహానికి అంగీకరించక ఆత్మత్యాగం చేసుకొనుట ద్వారా వైశ్యులకు కన్యకా పరమేశ్వరి ఆరాద్య దైవంగా నిలిచిన యువతి. ఈమె దైవాంశ సంభూతురాలని ఆమె మరణానికి ముందు ఆమె దైవాంశను అందరూ దర్శించారని వాసవిదేవి గాథలలో వ్రాయబడి ఉంది.

ఈ నగరం చారిత్రక ప్రాధాన్యత కలిగిన నగరం.రాజ్యపరిపాలన జరుగుతున్నకాలమందు ఈ ప్రాంతమునకు పెనుగొండ రాజదానిగా ఉండేది.

శ్రీ నగరేశ్వర స్వామివారి దేవస్థానముఇది ఊరికి దక్షణాన కల అతి పురాతన దేవాలయము.మొదట ఈ దేవాలయము తక్కువ విస్తీర్ణము కలిగి చిన్న దేవాలయముగా ఉండేది. తదనంతరము దీనిలో అంతర్భాగముగా కన్యకా పరమేశ్వరీ దేవస్థానము కట్టడంతో అతి పెద్ద దేవాలయముగా వృద్ది చెందినది. ఈ దేవాలయము నిడవోలు,నర్సాపురం ప్రధాన కాలువ తీరాన ఉంది.
శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయము .
కన్యకాపరమేశ్వరి ఆలయ గోపురము, ఆవరణ

ఆర్యవైశ్యుల కులదైవమయిన శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయము చారిత్రక నేపథ్యము కలిగి ఉంది. నిజానికి ఈ ఆలయము శ్రీ నగరేశ్వరస్వామి వారి దేవస్థాన ప్రాంగణములోనే వేరొక ప్రక్క నిర్మింపబడింది. తరువాత గోపురము, విశ్రాంతి మందిరములు కళ్యాణ మండపము ఇత్యాదులతో అభివృద్ధి చేయుటచే పెద్ద యాత్రా స్థలముగా మారినది.

పెనుగొండలో కల వాసవీధామ్ వద్ద ఉన్న 30 అడుగుల వాసవీమాత విగ్రహము

. . . పెనుగొండ (ప.గో) . . .

This article is issued from web site Wikipedia. The original article may be a bit shortened or modified. Some links may have been modified. The text is licensed under “Creative Commons – Attribution – Sharealike” [1] and some of the text can also be licensed under the terms of the “GNU Free Documentation License” [2]. Additional terms may apply for the media files. By using this site, you agree to our Legal pages . Web links: [1] [2]

. . . పెనుగొండ (ప.గో) . . .

Previous post త్రినేత్రుడు (సినిమా)
Next post కొత్తపల్లి (కోటబొమ్మాళి‌ మండలం)