త్రినేత్రుడు (సినిమా)

త్రినేత్రుడుఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1988లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, భానుప్రియ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు నిర్మించాడు. ఇది చిరంజీవి 100వ చిత్రం. ఇది 1984 లో ఆంగ్లంలో వచ్చిన బెవర్లీ హిల్స్ కాప్ అనే చిత్రానికి పునర్నిర్మాణం. 1997 లో ఈ చిత్రం ఆజ్ కా షెహన్షా అనే పేరుతో హిందీలోకి అనువాదం అయింది.

1988 filmమూస:SHORTDESC:1988 film
త్రినేత్రుడు
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం చిరంజీవి,
భానుప్రియ
సంగీతం రాజ్ – కోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1988 సెప్టెంబరు 22 (1988-09-22)
భాష తెలుగు

. . . త్రినేత్రుడు (సినిమా) . . .

గోవా తీరం డి. డి అనే పేరుగల ఒక మాఫియా చేతిలో ఉంటుంది. అతను బయటికి మంచివాడుగా కనిపిస్తూ లోలోపల డ్రగ్ మాఫియా నడుపుతుంటాడు. ఒక ఆశ్రమం స్థాపించి దాని ముసుగులో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. యువతకు డ్రగ్స్ అలవాటు చేసి మత్తులో ముంచివేసి దాని ద్వరా సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. దీన్ని గురించి తెలుసుకున్న భారత ప్రభుత్వం ఒక సిబిఐ ఆఫీసరును విచారణ కోసం నియమిస్తుంది. అతను ఆశ్రమం పేరిట జరిగే అక్రమాలన్నింటికీ ఆధారాలు సేకరించి పెడతాడు. కానీ ఆ ఫైలు ప్రభుత్వానికి చేరకముందే డి.డి మనుషులు అతన్ని చంపేస్తారు. తాము పంపించిన ఆఫీసరు ఎప్పటికీ తిరిగి రాకపోయే సరికి ప్రభుత్వానికి అనుమానం వచ్చి అభిమన్యు అనే మరో ఆఫీసరును నియమిస్తుంది.

అభిమన్యు వచ్చి గోవా డిఐజీని కలుస్తాడు. కానీ కేంద్రప్రభుత్వానికి, గోవా ప్రభుత్వానికి సయోధ్య లేకపోవడం వల్ల గోవా ప్రభుత్వం తరపున మరో ఇద్దరు కానిస్టేబుళ్ళు అభిమన్యుని అనుసరిస్తూ ఉంటారు.

ఈ సినిమా 1988 సెప్టెంబరు 22న విడుదలైంది. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు ఇదే తేదిన 1978లో విడుదలైంది.

. . . త్రినేత్రుడు (సినిమా) . . .

This article is issued from web site Wikipedia. The original article may be a bit shortened or modified. Some links may have been modified. The text is licensed under “Creative Commons – Attribution – Sharealike” [1] and some of the text can also be licensed under the terms of the “GNU Free Documentation License” [2]. Additional terms may apply for the media files. By using this site, you agree to our Legal pages . Web links: [1] [2]

. . . త్రినేత్రుడు (సినిమా) . . .

Previous post లింగారెడ్డిపల్లె (కొత్తచెరువు)
Next post పెనుగొండ (ప.గో)