
త్రినాథ వ్రతకల్పం
త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతము. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.
. . . త్రినాథ వ్రతకల్పం . . .
- బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల చిత్ర పటము,
- మామిడి ఆకులు
- అరటిమొక్కలు
- కొబ్బరికాయలు
- పండ్లు
- పువ్వులు
- పసుపు
- కుంకుమ
- గంధం
- హారతి కర్పూరం
- అక్షింతలు
- అగ్గిపెట్టె
- అగరు వత్తులు
- వస్త్రం
- యజ్ఞోపవితములు,
- కలశ చెంబులు (3)
- మర్రి ఆకులు (9-18)
- గంజాయి
- తోరములు (తెల్లని దారమునకు పసుపురాసి 9 వరుసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి, ఈ తోరములను తులసీ సహిత విష్ణునికి పూజచేసి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు)
- ప్రత్యేక నివేదన (పిండి వంటలు)
సీ|| చిన నాటినుండియు – సిరియన నెరుగని
బీద బాపడొకడు – పెరుగుచుండె
గృహిణి ప్రార్థన చేత – కూర్మితో గొనియెను
కురుచయై చెలగెడు – గోవునొండు
యా గోవు గానక – యజమాని యొకనాడు
దాని వెదుకబోయి – తాను గాంచె
బ్రహ్మ విష్ణు మహేశ్వ – రాభిధేయు లయిన
దేవతల నొక ప్ర – దేశమందు
గీ|| వారి నధిక భక్తి గొలిచి – వరలనపుడు
అష్ట భోగముల నంది త – నవని వీడె
పూర చరితులౌ దలచు – భూమి జనులు
వారి పూజించి భక్తిరో – బరగవలయు
. . . త్రినాథ వ్రతకల్పం . . .
This article is issued from web site Wikipedia. The original article may be a bit shortened or modified. Some links may have been modified. The text is licensed under “Creative Commons – Attribution – Sharealike” [1] and some of the text can also be licensed under the terms of the “GNU Free Documentation License” [2]. Additional terms may apply for the media files. By using this site, you agree to our Legal pages . Web links: [1] [2]